Page Loader
 Delhi Fire: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి చెందారు
Delhi Fire: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి చెందారు

 Delhi Fire: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి చెందారు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2024
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన నలుగురుమృతి చెందారు.మృతుల్లో భార్యాభర్తలు,ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న రెండు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి చాలా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంగళవారం తెల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం ప్రకారం,మొదటి అంతస్తులోని ఇన్వర్టర్ లో మంటలు చెలరేగాయి.దీని కారణంగా నలుగురు వ్యక్తులు పొగలో చిక్కుకున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ బృందం వారిని సంఘటనా స్థలం నుండి ఖాళీ చేసి పిసిఆర్ ద్వారా ఆసుపత్రికి పంపింది. ఆర్‌టిఆర్ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న సిఎంఓ డాక్టర్ చందన్ నలుగురు మరణించినట్లు ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం