Page Loader
జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్ 
జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్

జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్ 

వ్రాసిన వారు Stalin
Sep 05, 2023
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

జీ20 సదస్సు నేపథ్యంలో దిల్లీలో ఆన్‌లైన్ ఆర్డర్‌లు, ఇతర సేవలకు సంబంధించిన డెలివరీలపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు దిల్లీలోని అన్ని క్లౌడ్ కిచెన్‌లు, వాణిజ్య సంస్థలు, మార్కెట్‌లు, ఫుడ్ డెలివరీ, వాణిజ్య డెలివరీ సేవలు మూసివేసి ఉంటాయని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎస్‌ఎస్ యాదవ్ తెలిపారు. న్యూ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) జోన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీల ఆర్డర్లకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే, అవసరమైన వైద్య వస్తువుల డెలివరీతో సహా కొన్ని సేవలకు మినహాయింపు ఉందని చెప్పారు. దిల్లీ నగరమంతటా ల్యాబ్ నివేదికలు, నమూనా సేకరణకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

దిల్లీ

జీ20 సమ్మిట్‌కు ఆతిధ్యం ఇస్తున్న మొదటి దక్షిణాసియా దేశం భారత్

జిల్లాలోని హోటళ్లు, ఆసుపత్రులు, హౌస్‌కీపింగ్, క్యాటరింగ్, చెత్త పారవేయడం మొదలైన వాటిలో పాల్గొనే ఇతర ముఖ్యమైన ఇన్‌స్టాలేషన్‌ల కోసం వాహనాలను క్షణ్ణంగా పరిశీలించి అనుమతిస్తామని స్పెషల్ సీపీ వెల్లడించారు. దిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ ప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌లో కొత్తగా నిర్మించిన భారత్ మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది. ఈ సమిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునక్, కెనడియన్ ప్రీమియర్ జస్టిన్ ట్రూడో వంటి ప్రపంచ నాయకులు హాజరుకానున్నారు. జీ20 సమావేశానికి ఆతిధ్యం ఇస్తున్న మొదటి దక్షిణాసియా దేశం భారత్ కావడం గమనార్హం.