మాతో మాట్లాడితే ఇక్కడితో వదిలేస్తాం, లేకుంటే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం : గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని కెనడియన్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. కొద్ది రోజుల క్రితం సల్మాన్‌ను బెదిరింపులకు గురిచేస్తూ అతనికి మెయిల్స్ వచ్చాయి. ఇటీవలే పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలాను గోల్డీ బ్రార్ ముఠానే హత్య చేసింది. భాయ్ సాహెబ్ (లారెన్స్) ఎవరిని క్షమించే అవసరం లేదన్నాడని బ్రార్ అన్నాడు. దయ అవసరం అని అనుకున్నప్పుడు చూపిస్తామని పేర్కొన్నాడు. అయితే లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో గోల్డీ బ్రార్ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
వివాదం ఇక్కడితే ముగిసిపోవాలంటే సల్మాన్ గోల్డీబ్రార్‌తో మాట్లాడాలని ఈ మెయిల్
ఈ క్రమంలోనే సల్మాన్‌ను హత మార్చడం తన జీవిత లక్ష్యమని లారెన్స్ బిష్ణోయ్ గతంలోనే చెప్పిన మాటలను బ్రార్ గుర్తు చేసుకున్నాడు. సల్మాన్ ఒక్కడే కాదని, తమ శత్రువుల్లో ఎవరినీ వదలబోమని గోల్డీ బ్రార్ హెచ్చరిస్తున్నాడు. సల్మాన్‌ను బెదిరిస్తూ వచ్చిన మెయిల్స్ ఘటనపై గత మార్చిలోనే ఆరా తీసిన ముంబై పోలీసులు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై కేసు నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ స్నేహితుడు ప్రశాంత్ గుంజాల్కర్‌కు పంపిన ఈ -మెయిల్ ప్రకారం గోల్డీ బ్రార్ సల్మాన్ తో మాట్లాడాలనుకుంటున్నారని, బిష్ణోయ్ ఇంటర్వ్యూని అతనికి చూపించాలని అందులో పేర్కొన్నారు. ఈ విషయం ఇక్కడితే ముగిసిపోవాలంటే సల్మాన్ గోల్డీబ్రార్‌తో మాట్లాడాలని అందులో రాసినట్లు తెలుస్తోంది.