
Minister Kondapalli - MLA Ganta: గంటా శ్రీనివాస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో జరిగిన ఒక ఘటనలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
MSME పార్క్ పనుల శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన సభలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈరోజు జరిగిన MSME మీటింగ్ సందర్భంగా, కార్యక్రమం అనంతరం నాయకులతో ఫోటోలు దిగేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానికులు వేదికపైకి ఎగబడిన నేపథ్యంలో సభా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.
అయితే సకాలంలో సిబ్బంది స్పందించడంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అధికారులతో పాటు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
Details
MSME పార్క్ పనులకు శంకుస్థాపన
ఇంతకు ముందు రూ. 12.40 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన MSME పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ నేత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదికగా గంటా శ్రీనివాసరావు స్పందించారు.
పద్మనాభం మండలంలోని కృష్ణాపురంలో MSME పార్క్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించానని చెప్పారు.
ఉత్తరాంధ్రలో తొలి MSME పార్క్ అని, మొదటి దశలో 21.72 ఎకరాల్లో 163 ప్లాట్లు ఏర్పాటు చేశారన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 12.40 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ పార్క్ పూర్తిగా అభివృద్ధి అయితే వేలాది గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.