తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ప్రసిద్ధ కంబం ద్రాక్షకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కంబం ద్రాక్ష భౌగోళిక సూచిక ట్యాగ్(జీఐ) ట్యాగ్‌ని పొందింది. కంబం ద్రాక్షను కంబం పన్నీర్ త్రాట్‌చై అని కూడా పిలుస్తారు.
తమిళనాడులోని పశ్చిమ కనుమల వద్ద ఉన్న కంబం వ్యాలీని 'దక్షిణ భారతదేశం ద్రాక్ష నగరం' అని పిలుస్తారు. ఇక్కడ పన్నీర్ త్రాట్‌చాయ్‌ను ఎక్కువ పండిస్తారు. పన్నీర్ త్రాట్‌చై అత్యధికంగా ద్రాక్షను పండించే ప్రాంతాల్లో తేని జిల్లా ఒకటి.
ఇక్కడ 10 గ్రామాల్లో 2,000 ఎకరాలల్లో పంటను పండిస్తారు. పన్నీర్ ద్రాక్షను మొట్టమొదట 1832లో ఒక ఫ్రెంచ్ పూజారి తమిళనాడులో ప్రవేశపెట్టారు. ఈ ద్రాక్షలో విటమిన్లు, టార్టారిక్ యాసిడ్,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
తమలపాకు
తమిళనాడు 'ఆథూర్ తమలపాకు'లకు జీఐ ట్యాగ్
తమిళనాడులో ఎంతో ప్రత్యేకమైన ఆథూర్ తమలపాకులు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌ను ఎట్టకేలకు పొందాయి.
ఇక్కడి పొలాలకు సాగునీరు అందించడానికి ఉపయోగించే తామిరబరణి నది నీరు కారణంగానే ఇక్కడ ఆథూర్ తమలపాకులు ఎక్కువ పండటానికి కారణంగా చెబుతుంటారు.
500 ఎకరాలకు పైగా భూమిలో ఈ తమలపాలను సాగు చేపడుతున్నారు.
ఆథూర్ వెట్రిలైలో నట్టుకోడి, పచ్చికోడి, కర్పూరి అనే మూడు రకాలు ఉన్నాయి.
పచ్చికోడి ఆకులను వంటల్లో రుచి, సువాసనకు ఉపయోగిస్తారు.
నట్టుకోడి ఆకులను సాంప్రదాయ వైద్యంలో తరచుగా జలుబు, దగ్గు మరియు ఫ్లూ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
కర్పూరి తమలపాకులు తలనొప్పి, కడుపు సమస్యలు ఇతర వ్యాధుల నుండి ఉపశమనం కలిగించే ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు.