Yadagirigutta : యాదగిరిగుట్టలో స్వర్ణ శోభ.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విమాన గోపుర ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఈ గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణల నడుమ గోపురాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు.
భవ్యతతో జరిగిన మహోత్సవం
గోపుర మహా సంప్రోక్షణ కోసం 40 జీవనదుల పవిత్ర జలాలతో అభిషేకం చేసి, వైదిక బృందం శాస్త్రోక్తంగా స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును నిర్వహించింది.
సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు స్థానిక ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Details
స్వర్ణ విమాన గోపుర విశేషాలు
ఎత్తు: 5.05 అడుగులు
వైశాల్యం: 10,759 చదరపు అడుగులు
బంగారం వినియోగం: 68 కిలోలు
స్వర్ణ తాపడం ఖర్చు: రూ.3.80 కోట్లు
మొత్తం వ్యయం: రూ.8 కోట్లు
ఈ గోపురాన్ని భవ్యమైన కృష్ణశిల్పకళా వైభవంతో రూపొందించారు. స్వర్ణ రేకులతో కప్పిన ఈ గోపురం భక్తులకు కనువిందు చేయనుంది.
ప్రతిష్టాపన అనంతరం బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
మార్చి 1 నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. మార్చి 8న స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి అలంకార, వాహన సేవలు వైభవంగా సాగనున్నాయి.