Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో 'రైతు భరోసా' నిధులను జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ లేదా రేపటి నుండి నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఇదివరకే ఒక ఎకరం భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
సుమారు 17 లక్షల మంది ఎకరం భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
తాజాగా రెండు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లోనూ రైతు భరోసా నిధులను జమ చేయనుంది.
Details
ప్రతి ఏటా ఎకరానికి రూ.12వేలు
తెలంగాణ సర్కారు ఇటీవలే 'రైతు భరోసా', 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా', 'రేషన్ కార్డులు', 'ఇందిరమ్మ ఇండ్ల పథకాలు' ప్రారంభించింది.
అయితే వీటిని వేర్వేరుగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా 'రైతు భరోసా' కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రతి ఏటా ఎకరానికి రూ. 12,000 చొప్పున అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
తొలి విడతగా ప్రస్తుతం అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6,000 జమ చేస్తోంది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం కింద, మొదటిగా 563 గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.
Details
రెండు ఎకరాల భూమి ఉన్న రైతు ఖాతాల్లోకి 'రైతు భరోసా'
రెండో విడతలో ఒక ఎకరం భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది.
ఇప్పుడు రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లోనూ 'రైతు భరోసా' నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
రైతులకు రెండు విడతల్లో ఎకరాకు రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం ఎకరానికి రూ. 6,000 చొప్పున అందిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో 563 గ్రామాల్లో నిధులు విడుదల చేయగా, ఇటీవల ఒక ఎకరం భూమి కలిగిన అర్హులైన రైతుల ఖాతాల్లో రూ. 6,000 చొప్పున నిధులు జమ చేశారు.
Details
రూ.1,126 కోట్లు జమ
మొత్తం జనవరి 27 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు 21,45,330 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 1,126 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్లు వెల్లడించింది.
'రైతు భరోసా' నిధులను దశలవారీగా మార్చి 31 వరకు అర్హులైన రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
తాజాగా, ఒక ఎకరం భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఇవాళ లేదా రేపటి నుండి రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.