Job Fair: నిరుద్యోగులకు శుభవార్త.. ఈ నెల 21న మినీ జాబ్ మేళా.. ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు, యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ,ఉపాధి అవకాశాలను అందిస్తోంది.
ప్రత్యేకంగా రూపొందించిన నైపుణ్యాభివృద్ధి సంస్థ (Skill Development Corporation) ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పదవ తరగతి నుంచి పై స్థాయిల్లో విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తోంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ, వందల మందికి ఉపాధి అవకాశాలను అందిస్తోంది.
ఈ క్రమంలో, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని NAC సెంటర్ లో ఈ నెల 21న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆనంద్ రాజకుమార్ వెల్లడించారు.
వివరాలు
ఈ నెల 21న మినీ జాబ్ మేళా
ఈ జాబ్ మేళాలో హ్యుండాయ్ మోబిస్, నవభారత్ ఫెర్టిలైజర్స్, ఎల్ ఎల్ పి, కేఐఎంఎల్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి.
పదవ తరగతి నుంచి B.Sc, M.Sc, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీటెక్, ఎంబీఏ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని పొందవచ్చు.
ఈ ఉద్యోగ మేళా 21-02-2025 ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభమవుతుంది.
ఎంపికైన అభ్యర్థులకు జీతం పదివేల రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు లభిస్తుందని తెలిపారు.
ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి.
వివరాలు
అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ లో హాజరు కావలి
అలాగే అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ లో మాత్రమే హాజరు కావాల్సిందిగా సూచించారు.
జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం http://naipunyam.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా మరిన్ని వివరాల కోసం 9177413642 నంబర్‌ను సంప్రదించవచ్చు.