తదుపరి వార్తా కథనం

Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 17, 2025
04:55 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
కర్నూలులో జరిగిన 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.
'దేశంలో అత్యధికంగా పింఛను అందిస్తున్న రాష్ట్రం మనదే. అన్న క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించాం.
'దీపం-2' పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం.
పాఠశాలలు తెరచేలోగా ఉపాధ్యాయ నియామకం పూర్తవుతుందని సీఎం తెలిపారు. మహిళల సంక్షేమానికి, విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.