MLC Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వరంగల్ - నల్గొండ -ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసింది.
మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాగా ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని బిజెపి నేతలు ఆరోపించారు. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఇందుకు తగిన నగదు విత్ డ్రా చేసిన ఆధారాలను సమర్పించారు.
ఉమ్మడి వరంగల్ - నల్గొండ - ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC Elections)ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
Details
దాదాపు 60 శాతం పోలింగ్
క్యూలైన్లలో ఉన్న వారు ఓటు వేసేందుకు అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు.
మధ్యాహ్నం 2 గంటల వరకూ 49.53 శాతం పోలింగ్ నమోదు కాగా.. 4 గంటల వరకూ దాదాపు 60 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 605 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ సాగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీనితో .. ఉప ఎన్నిక అనివార్యమైంది.
Details
3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు
52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఏనుగల రాకేష్‌రెడ్డి పోటీలో నిలిచారు.
వీళ్లతో పాటు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల విధానాలను వ్యతిరేకించే వాళ్లంతా కూడా స్వతంత్రంగా బరిలో నిలబడ్డారు.
ఈ ఎన్నికల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారు.