NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు.. భారీగా నమోదైన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు.. భారీగా నమోదైన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు
    తెలంగాణ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు.. భారీగా నమోదైన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు

    Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు.. భారీగా నమోదైన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 01, 2025
    08:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.

    ప్రజలు కొత్త ఏడాదిని ఆనందంగా స్వాగతం పలికారు. డీజేలు, డ్యాన్స్‌లు, ఇతర వినోదాలతో ప్రజలు ఉత్సాహంగా మునిగిపోయారు.

    హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు వేడుకల్లో పాల్గొని ఉత్సవాలను ఆస్వాదించారు.

    అయితే, పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కొందరు మందుబాబులు రోడ్లపైకి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కారు.

    హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

    ఈ తనిఖీల సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగారు.

    వివరాలు 

    మందుబాబుల పరుగులు

    నగర వ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

    వీటిలో ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 236 కేసులు నమోదుకాగా, సౌత్ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179, సౌత్ వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్‌లో 177, సెంట్రల్ జోన్‌లో 102 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

    మరోవైపు, హైదరాబాద్‌లోని వెంగళరావు పార్క్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.

    అతనికి నిర్వహించిన శ్వాస పరీక్షలో 550 పాయింట్లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

    ఇక రోడ్లపై పోలీసుల తనిఖీలను చూసి, కొందరు మందుబాబులు తమ బైక్‌లను వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని పట్టుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    హైదరాబాద్

    Knight Frank India: అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో హైదరాబాద్‌.. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక  బెంగళూరు
    Hyderabad:హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అగ్నిప్రమాదం
    Telangana student: పుట్టినరోజు నాడు పేలిన సొంత తుపాకీ..  అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి   తెలంగాణ
    Hyderabad: ఓయూ కీలక నిర్ణయం.. హిందీ మహావిద్యాలయ అనుమతుల రద్దు ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025