
TGSRTC: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. టీజీఎస్ఆర్టీస్‌లో 3,035 ఉద్యోగాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి గురైందని, ఉద్యోగ నియామకాలు జరగలేదని ఆయన విమర్శించారు.
దీంతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సరికొత్త విధానాలతో ఆర్టీసీని పునరుద్ధరించడమే కాకుండా లాభాల్లోకి తెచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
Details
రెండు, మూడు వారాల్లో నోటిఫికేషన్
ఉద్యోగాల భర్తీ, కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
తొలి దశలో 3,035 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమోదం తెలిపారన్నారు.
దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు రెండు, మూడు వారాల్లో విడుదలవుతాయని చెప్పారు.
అదనంగా మరో 3,000 నుంచి 4,000 పోస్టుల భర్తీపై కూడా పరిశీలన జరుగుతోందని, ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు.
Details
ప్రభుత్వం ప్రకటించే పోస్టులు ఇవే
2,000 డ్రైవర్ పోస్టులు
743 శ్రామిక్ పోస్టులు
114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) పోస్టులు
84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) పోస్టులు
25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు
23 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు
15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు
11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్) పోస్టులు
7 మెడికల్ ఆఫీసర్ (జనరల్) పోస్టులు
7 మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) పోస్టులు భర్తీ చేయనున్నాయి.