Page Loader
ఎమిరేట్స్ విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. దిల్లీకి మళ్లిన ఫ్లైట్
దిల్లీకి మళ్లిన ఫ్లైట్

ఎమిరేట్స్ విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. దిల్లీకి మళ్లిన ఫ్లైట్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 09, 2023
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. (Dubai-Guangzhou Emirates Aeroplane) దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన EK- 362 ఎమిరేట్స్ విమానం అత్యవసర వైద్య పరిస్థితుల కారణంగా దిల్లీకి మళ్లింది. విమానం దిల్లీలో ల్యాండ్ అయ్యాక, హుటాహుటిన బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మెడికల్ ఎమర్జెన్సీ వల్ల గ్వాంగ్‌జౌ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం శుక్రవారం ఇందిరాగాంధీ విమానాశ్రయానికి మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. వైద్య సహాయం అవసరమైన బాధిత ప్రయాణికుడిని తొలుత పరీక్షించిన వైద్య సిబ్బంది, అనంతరం వైద్య చికిత్సలు అందించారు. దీంతో దిల్లీ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ గ్వాంగ్‌జౌకు బయల్దేరిందని విమానయాన అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రయాణికుడికి అవసరమైన వైద్య పరీక్షలు