Gujarat 2024 : నూతన సంవత్సరం వేళ.. సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డ్
గుజరాత్ సర్కారు నూతన సంవత్సరాన్ని సరికొత్తగా ఆరంభించింది. ఈ మేరకు ఒకేసారి 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. ఆరోగ్యమే మహాభాగ్యం,ఐకమత్యమే మహాబలం సందేశాన్ని చాటి చెబుతూ గుజరాత్Gujarat) ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంసలోనే ఏక కాలంలో 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్(Guinness Record)లో చోటు సంపాదించింది. ప్రసిద్ధ మోధెరా సూర్య దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఈ సూర్య నమస్కారాలు చేశారు. దాదాపుగా 108 ప్రాంతాల్లో సుమారుగా 4వేల మందికిపైగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, పలు కుటుంబాలు, యోగా ఔత్సాహికులు, వయో వృద్ధులు సలైతం హాజరయ్యారు.
రోజూవారి జీవితంలో సూర్య నమస్కారాన్ని భాగం చేసుకోవాలి : ప్రధాని మోదీ
మోధెరా సూర్య దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో 51 విభిన్న కేటగిరీల్లో ఈ సూర్యనమస్కారాలను ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ సంఘ్వీ హాజరయ్యారు. అత్యధిక మంది ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడంలో ఇదే తొలిసారని, గతంలో ఇలాంటి ఘనతను ఎవరూ చేయలేదని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి అన్నారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ప్రధాని 2024ను గుజరాత్ అరుదైన ఘనతతో స్వాగతించిందన్నారు. 108వేదికల్లో అత్యధిక మంది సూర్యనమస్కారాలు చేసి మన సంస్కృతి,సంప్రదాయాల్లో 108 సంఖ్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో చాటిచెప్పారన్నారు. ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు.