Page Loader
Gutha Amith Reddy: రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌రెడ్డి 
రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌రెడ్డి

Gutha Amith Reddy: రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌రెడ్డి 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2024
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

నల్గొండలో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ ఇస్తూ పార్టీ సీనియర్‌, తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అమిత్ రెడ్డి చేరికను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్లాన్ చేసి అమలు చేశారు. మంత్రి అమిత్‌ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లగా, అక్కడ సీఎం అమిత్‌కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ , డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్