Page Loader
Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు 
Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు

Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు 

వ్రాసిన వారు Stalin
Dec 19, 2023
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టులో ముస్లిం పక్షానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన సివిల్ దావాను సవాలు చేస్తూ ముస్లిం సంఘాలు దాఖలు చేసిన మొత్తం 5 పిటిషన్లను కోర్టు హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ కేసు విచారణను 6 నెలల్లోగా పూర్తి చేయాలని అలహాబాద్ హైకోర్టు.. మంగళవారం వారణాసి కోర్టును ఆదేశించింది. హిందువులకు పూజలు చేసే హక్కును కోరుతూ 1991 నాటి సివిల్ దావా, మసీదు సర్వే కోసం 2021లో వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వును ప్రార్ధనా స్థలాల చట్టం అడ్డుకోలేదని హైకోర్టు పేర్కొంది.

హైకోర్టు

సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ముస్లిం సంఘాలు

అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ (AIMC), ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు 1991 సివిల్ దావా, 2021 ఆర్డర్‌ను సవాలు చేస్తూ పిటిషన్‌లను దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌లను హైకోర్టు సున్నితంగా తిరస్కరించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ముస్లిం సంఘాలు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన వివాదం శతాబ్దాల నాటిది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సూచనల మేరకు జ్ఞాన్‌వాపి మసీదు నిర్మించారని, ఇందుకోసం కాశీ విశ్వనాథ దేవాలయంలో కొంత భాగాన్ని కూల్చివేశారని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఆలయానికి మసీదుకు ఎలాంటి సంబంధం లేదని, ప్రత్యేక స్థలంలోనే దీన్ని నిర్మించినట్లు మసీదు కమిటీ చెబుతోంది.