Page Loader
 West Bengal: నర్సుపై వేధింపులు.. బెంగాల్‌లో మరో ఘటన 
నర్సుపై వేధింపులు.. బెంగాల్‌లో మరో ఘటన

 West Bengal: నర్సుపై వేధింపులు.. బెంగాల్‌లో మరో ఘటన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2024
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బెంగాల్‌లో మరో నర్సు నైట్‌షిఫ్ట్‌లో వేధింపులు ఎదుర్కోవడం కలకలం రేపుతోంది. బీర్భమ్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చోటోచక్‌ గ్రామానికి చెందిన అబ్బాస్‌ ఉద్దిన్‌ అనే రోగి జ్వరం కారణంగా ఆసుపత్రికి తరలించారు.

Details

కేసు నమోదు చేసిన పోలీసులు

వైద్యులు అతనికి సెలైన్‌ ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా, విధుల్లో ఉన్న ఓ మహిళా నర్సుపై అతను అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో నర్సు అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.