Page Loader
Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో)
వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు

Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2024
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు సభా వేదికపైనే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటన సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే చోటుచేసుకున్నట్లు సమాచారం. హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలిపై అనుచిత ప్రవర్తనకు పాల్పడడంపై కాంగ్రెస్ నేత సెల్జా కుమారి దీన్ని తీవ్రంగా ఖండించారు. బాధిత మహిళతో మాట్లాడిన అనంతరం, ఈ దారుణంపై నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Details

చట్టపరమైన చర్యలు తప్పవు

ఇదే విషయంపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా స్పందించారు. దీపేందర్ హుడా సమక్షంలోనే వేదికపైనే మహిళా కాంగ్రెస్ నాయకురాలిపై పార్టీ నేతలు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పూనావాలా, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలపై జరుగుతున్న వేధింపుల్ని అడ్డుకోవాలని, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహిళా నేతపై అనుచిత ప్రవర్తన