LOADING...
E20: E20 పెట్రోల్‌ సురక్షితం కాదన్న అభిప్రాయాలు భ్రమ: హర్‌దీప్ సింగ్ పూరీ
E20: E20 పెట్రోల్‌ సురక్షితం కాదన్న అభిప్రాయాలు భ్రమ: హర్‌దీప్

E20: E20 పెట్రోల్‌ సురక్షితం కాదన్న అభిప్రాయాలు భ్రమ: హర్‌దీప్ సింగ్ పూరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్‌ (E20) సురక్షితమా అనే చర్చ చురుకుగా జరుగుతోంది. కొందరు ఇంధనాలు వాహనాల ఇంజిన్లకు నష్టం చేస్తాయని ప్రచారం చేస్తున్నప్పటికీ, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ ఈ వాదనను కొట్టిపారేశారు. వాహనాల మైలేజీ E20 వల్ల తగ్గుతుందన్న ఆ అభిప్రాయం చెత్త వాదన అన్నారు. ఈ20 ఇంధనం పర్యావరణానికి అనుకూలంగా, సురక్షితమని. అయితే, పాత వాహనాల్లో దీర్ఘకాలంలో గ్యాస్కెట్‌లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులు మారాల్సి రావచ్చని.. అది సాధారణమైన విషయమేనని పేర్కొన్నారు.E20: E20 పెట్రోల్‌ సురక్షితం కాదన్న అభిప్రాయాలు భ్రమ: హర్‌దీప్ సింగ్ పూరీ

వివరాలు 

20 సంవత్సరాల్లో భారత్‌లో ఇంధన అవసరం ప్రపంచ దేశాలకంటే మూడు రెట్లు ఎక్కువవుతుంది:పూరి 

కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇథనాల్ వలన సమస్యలు వస్తాయని ప్రజల్లో భయం సృష్టిస్తున్నారని. అంతర్జాతీయ ఇంధన సంస్థల అంచనాల ప్రకారం, రాబోయే 20 సంవత్సరాల్లో భారత్‌లో ఇంధన అవసరం ప్రపంచ దేశాలకంటే మూడు రెట్లు ఎక్కువవుతుంది. అప్పుడు ఇథనాల్‌ ప్రధాన ఇంధన వనరుగా మారే అవకాశం ఉందని హర్‌దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. పెట్రోల్‌ కంటే ఇథనాల్‌ ఎనర్జీ డెన్సిటీ కొంచెం తక్కువగా ఉండడంతో మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అది అత్యంత తక్కువవని ఆ శాఖ స్పష్టం చేసింది.

వివరాలు 

ఇథనాల్ కలిగిన పెట్రోల్ వలన ఇంజిన్ సమస్యలు తలెత్తవు 

వాహనదారుల్లో E20 వాహనాల సామర్థ్యాన్ని, డ్రైవింగ్‌ను ప్రభావితం చేస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వలన మైలేజీ తగ్గుతుందంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ ఇప్పటికే ఈ విషయంపై స్పష్టత ఇచ్చి, ఇథనాల్ కలిగిన పెట్రోల్ వలన ఇంజిన్ సమస్యలు తలెత్తవని ప్రకటించింది. ఇథనాల్ వలన కార్బన్ ఉద్గారాలు తగ్గి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు లాభం వస్తుందని తెలిపారు. కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఈ విషయంపై అనేకసార్లు స్పష్టత ఇచ్చారు.