
Supreme court: హెచ్‌సీయూ భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ నేపథ్యంలో, హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌కు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
గురువారం మధ్యాహ్నం 3.30 గంటలలోపు నివేదికను సమర్పించాలని స్పష్టంగా సూచించింది.
ప్రభుత్వం విక్రయించాలని అనుకున్న భూములను ప్రత్యక్షంగా పరిశీలించి, వివరాలతో కూడిన నివేదిక అందించాల్సిందిగా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు ఇచ్చింది.
30 ఏళ్లుగా ఈ భూమి వివాదాస్పదంగా కొనసాగుతోందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అటవీ భూమిగా పరిగణించేలా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు వివరించారు. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడం లేదని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రిజిస్ట్రార్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టుకు చేరిన HCU వ్యవహారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పై సుప్రీంకోర్టులో విచారణ జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ ను కంచ గచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్న 3:30 గంటల వరకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించిన సుప్రీం pic.twitter.com/9d3QH5lU5f
— Voice of Andhra (@VoiceofAndhra3) April 3, 2025