Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
మద్యం, ఇసుక పాలసీ కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. మద్యం కేసులో విచారణను రేపటికి వాయిదా వేయగా, ఇసుక కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తూ హైకోర్టు (High Court) ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు వాదనలు ప్రారంభమయ్యాయి. ఇక ఇవాళ సీఐడీ తరుపు లాయర్లు వాదనలు వినిపించారు. మద్యం కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిన్నటి విచారణలో చంద్రబాబు న్యాయవాదులు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేశారు : సీఐడీ తరుపు న్యాయవాది
మరోవైపు పబ్లిక్ సర్వెంట్‌గా ఉంటూ చంద్రబాబు అధికారం దుర్వినియోగం చేశారని సీఐడీ తరుపు లాయర్ వాదించారు. ముఖ్యంగా క్యాబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్లారని, దాని వల్ల భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందన్నారు. ఇక ఎక్సైజ్ పాలసీని 5 నుండి 10 శాతానికి ఉద్ధేశ పూర్వకంగానే మార్చారన్నారు. కొంతమందికి బెనిఫిట్ అయ్యేలా చేసి లైసన్సు ఇచ్చారని సీఐడీ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.