LOADING...
Heatwaves: ఉత్తరాంధ్రలో వడగాలులు.. పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం
ఉత్తరాంధ్రలో వడగాలులు.. పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం

Heatwaves: ఉత్తరాంధ్రలో వడగాలులు.. పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని, రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రకటించారు. ఇదే సమయంలో తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్‌ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణ మార్పులు కనిపించే అవకాశముంది. ఈ ప్రభావంతో విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఈ భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వివరాలు 

54 మండలాల్లో వడగాలులు

శుక్రవారం విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, తెర్లాం, వంగర మండలాలు; పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం మండలాలు; పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే శనివారం రాష్ట్రంలోని 54 మండలాల్లో వడగాలులు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement