Page Loader
Mulugu: ములుగు అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
ములుగు అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Mulugu: ములుగు అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2024
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

డండకారణ్యం మళ్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఎప్పుడూ పచ్చగా కనిపించే అటవీప్రాంతం, రక్తసిక్తమై ఎరుపెక్కింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వరుస ఎన్‌కౌంటర్ల తర్వాత ఇప్పుడు తెలంగాణలోనూ ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లా చల్పాక సమీపంలోని అడవుల్లో మావోయిస్టులు, పోలీసులు ఎదుర్కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Details

మృతుల్లో మవోయిస్టు కీలక నేత

మృతుల్లో మావోయిస్ట్ కీలక నేత బద్రు ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు మరికొందరు కీలక నేతలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితం మావోయిస్టులు ఇద్దరు ఆదివాసీలను ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. ఆ దుర్ఘటన మరవకముందే, ములుగు అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది. ఈ ఎన్‌కౌంటర్ డాంబికంగా మారుతుండగా, అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Details

మృతి చెందిన మావోయిస్టుల వివరాలు

1. కుర్సం మంగు @ భద్రు @ పాపన్న.. TSCM, సెక్రటరీ ఇల్లందు - నర్సంపేట AC, AK-47 రైఫిల్. 2. ఈగోలపు మల్లయ్య @ మధు.. DVCM, కార్యదర్శి ఏటూరునాగారం, మహదేవ్‌పూర్ ఏసీ, ఏకే-47 రైఫిల్. 3. ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM. 4. ముస్సాకి జమున ACM. 5. జైసింగ్, పార్టీ సభ్యుడు. 6. కిషోర్, పార్టీ సభ్యుడు. 7. కామేష్,పార్టీ సభ్యుడు.