Page Loader
Khammam: మున్నేరుకు భారీగా వరద.. ప్రమాద హెచ్చరికలు జారీ
మున్నేరుకు భారీగా వరద.. ప్రమాద హెచ్చరికలు జారీ

Khammam: మున్నేరుకు భారీగా వరద.. ప్రమాద హెచ్చరికలు జారీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2024
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మంలోని మున్నేరులో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రవాహం 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతం ప్రస్తుతం డేంజర్ జోన్‌గా మారింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు మరింత తీవ్రతరం కావడంతో ఆదివారం అర్ధరాత్రి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Details

రోడ్లు బ్లాక్ చేయాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ 

వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు బ్లాక్ చేయాలంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 16వ డివిజన్‌ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో పరిస్థితులను పరిశీలించి, వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. శనివారం రాత్రి కూడా మున్నేరు ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఆదివారం, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం వస్తారని తెలిపారు. ఇక మహబూబాబాద్‌, గార్ల, బయ్యారం మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి,