Heavy Rain: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ.. దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన వాయుగుండం..
ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండం ముప్పు ముంచుకు వస్తోంది. కోత దశలో ఉన్న పంటలకు భారీ వర్షాలు తీవ్ర నష్టం కలిగించే అవకాశమున్నందున, అప్రమత్తంగా ఉండాలని అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, తమిళనాడు-శ్రీలంక దిశగా కదులుతూ మరింత బలపడుతోంది. "దాన" తుఫాన్ తరువాత, మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు వెలువడాయి. వాయుగుండం ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చి, గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ప్రయాణిస్తున్నదని వాతావరణశాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావం ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను ఎక్కువగా ప్రభావితం చేయనున్నట్లు అంచనా వేయబడింది.
పంటలు నేలకొరిగే పరిస్థితి
విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకారం, ఈనెల 29న ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఈ వార్తలు రైతులలో ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉండగా, వరి పొలాల్లోనే నిల్వ ఉండిపోయింది. ఈ పరిస్థితుల్లో భారీ వర్షాలు సంభవిస్తే, పంటలు నష్టపోయే ప్రమాదం ఉంది. గాలుల వేగం అధికంగా ఉండటంతో పంటలు నేలకొరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ (IMD) సూచనలు అందించింది.
పలు ప్రాంతాల్లో వర్షాలు
మరో వైపు, ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపోస్పియర్‌లో ఈశాన్య గాలుల ప్రభావం కొనసాగుతోంది. వాయుగుండం ప్రభావంతో మొదట తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ, వీటిలో క్రమంగా పెరుగుదల ఉంటుందని అంచనా వేయబడింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, అధికారులు ప్రజలకు అప్రమత్తత సూచనలు చేస్తున్నారు.