Page Loader
Heavy Rains: తమిళనాడుకు భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
తమిళనాడుకు భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Heavy Rains: తమిళనాడుకు భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2024
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వాతావరణ శాఖ తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ క్రమంలో ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, కడలూరు, మైలదుత్తురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్‌, పుదుక్కోట్టై, రామనాథపురం, విల్లుపురం జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కరైకల్‌ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Details

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఈ వర్షాల కారణంగా, చెన్నై జిల్లా కలెక్టర్‌ రష్మీ సిద్ధార్థ్‌ మహా నగరంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కాగా, ఐఎండీ నవంబర్ 15 వరకు పలు జిల్లాలకు వర్ష సూచనలు జారీ చేసింది. నవంబర్ 12న 12 జిల్లాలు, 13న 17 జిల్లాలు, 14న 27 జిల్లాలు, 15న 25 జిల్లాల్లో వర్షాలు వస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారీ వర్షాల కారణంగా సెలవులు