IMD Warning: పలు రాష్ట్రాలకు ఐఎండీ అతి భారీ వర్ష సూచన
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది.
కొన్ని రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఈ మేరకు సంబంధిత రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది.
ఇందులో కేంద్ర పాలిత ప్రాంతాలు,రాష్ట్రాలు కూడా ఉన్నాయి.గురువారం అస్సాం,మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
శుక్ర,శనివారం రోజుల్లో జమ్మూకాశ్మీర్,లడఖ్,హిమాచల్ ప్రదేశ్‌లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అదేవిధంగా,గురు,శుక్ర,శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.
దీనితో,సంబంధిత రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్
#WATCH | A layer of dense fog witnessed in Haryana's Jhajjar. pic.twitter.com/ke3KwWQHLw
— ANI (@ANI) March 12, 2025