తదుపరి వార్తా కథనం

Heavy Rains: హైదరాబాద్ కు బిగ్ అలర్ట్.. సాయంత్రానికి భారీవర్షం
వ్రాసిన వారు
Sirish Praharaju
May 17, 2024
05:00 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో శుక్రవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
రంగారెడ్డి,మెదక్,సంగారెడ్డి,కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని అలర్ట్ ఇచ్చింది.
ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.
ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందునా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.