Telangana: భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించపోయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 2న ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. పలుచోట్ల రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండడంతో, ప్రజలు అత్యవసరం అయితే తప్ప రోడ్డు దాటేందుకు ప్రయత్నించవద్దని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రజలు బయటికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.