Page Loader
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2024
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో ప్రత్యేకంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతవారణ శాఖ హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్ర కోస్తాలో 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తోంది.

Details

రైతులు అప్రమత్తంగా ఉండాలి

గత గురువారం, తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మరియు కామారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అనంతరం, ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ ప్రకటించింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.