Page Loader
Rain Alert: నేడు,రేపు భారీ వర్షాలు.. గంటకు 40-50 కి.మీ. ఈదురు గాలులు 
నేడు,రేపు భారీ వర్షాలు..

Rain Alert: నేడు,రేపు భారీ వర్షాలు.. గంటకు 40-50 కి.మీ. ఈదురు గాలులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2024
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు,రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జూన్ 28, జూలై 15, 19, ఆగస్టు 3, 29, సెప్టెంబర్ 5, 13, 23 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, లానినో ప్రభావం కారణంగా ఖమ్మం, విజయవాడ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా రావడం వలన, మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

వివరాలు 

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు 

దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావం వల్ల ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. బుధవారం ములుగు జిల్లాలో ఏటూరునాగారం ప్రాంతంలో 123.3 మి.మీ, సూర్యాపేటలో 56.5 మి.మీ, ఆదిలాబాద్‌లో 46 మి.మీ వర్షపాతం నమోదయింది.