
Heavy Rains: తెలంగాణ, ఏపీ మధ్య నిలిచిపోయిన వాహన రాకపోకలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లు జలమయమవుతుండటంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య వాహనాల రాకపోకలు ఇబ్బందికరంగా మారింది.
దీంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకల నిలిచిపోయాయి. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
కోదాడ నుంచి భారీ వరదనీరు దిగువకు ప్రవహిస్తూ నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి చేరుకుంది.
దీంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
Details
వాహన రాకపోకలను నిలిపివేసిన అధికారులు
నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద మున్నేరు వాగు జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తోంది.
హైవేపై మోకాళ్ళ లోతు వరద నీరు రావడంతో, వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా, హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద మరియు విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపివేశారు.
ఈ కారణంగా హైవే పూర్తిగా స్తంభించిపోయింది. వరద తగ్గేవరకు హైవేపై వాహనాలను అనుమతించబోమని అధికారులు తెలిపారు.