Page Loader
Hemant Soren - interim bail-Rejected: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కోర్టులో చుక్కెదురు
జార్ఞండ్​ మాజీ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ (ఫైల్​ ఫొటో)

Hemant Soren - interim bail-Rejected: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కోర్టులో చుక్కెదురు

వ్రాసిన వారు Stalin
Apr 27, 2024
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్ (Jarkhand)మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ (Hemanth Soren)కు రాంచీ కోర్టు(Ranchi Court)లో చుక్కెదురైంది. రాంచీలోని ప్రత్యేక అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)(PMLA) కోర్టు శనివారం ఆయనకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. తన పెదనాన్నరాజారాం సొరేన్(RajaRam Soren) అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 13 రోజుల మధ్యంతర బెయిల్‌ను కోరారు. అతని పెదనాన్న రాజా రామ్ సోరెన్, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు శిబు సోరెన్‌ (Sibu Soren)కి అన్నయ్య. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బెయిల్ కోసం ఇదివరకే సొరేన్ సుప్రీం కోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. హేమంత్ సొరేన్ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్(Kapil Sibal)శనివారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.

Hemanth Soren‌‌-Bail Rejected

హైకోర్టు జాప్యంపై సుప్రీంకోర్టులో కపిల్​ సిబల్​ వాదనలు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(Enforcement Directorate)తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ చేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకోవడంలో చేసిన జాప్యాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఫిబ్రవరి 27-28 తేదీల్లో విచారించి తీర్పును రిజర్వ్ చేసిందని ఇప్పటికీ ప్రకటించలేదని పేర్కొంటూ సిబల్ అత్యవసర విచారణను కోరగా సుప్రీం కోర్టు అందుకు అనుతించడంతో ఆయన తన వాదనలను ధర్మాసనానికి వినిపించారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయగా అప్పట్నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. సోరెన్, భాను ప్రతాప్ ప్రసాద్, రాజ్ కుమార్ పహాన్, హిలారియాస్ కచ్చప్, బినోద్ సింగ్‌లపై ఈడీ మార్చి 30న చార్జిషీట్ దాఖలు చేసింది. సోరెన్‌కు చెందిన 8.86 ఎకరాల భూమిని కూడా ఈడీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.