Hemant Soren: భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌కు బెయిల్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. అంచల్ భూ కుంభకోణం కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో జూన్ 13న విచారణ పూర్తయి, అనంతరం నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. జస్టిస్ రంగన్ ముఖోపాధ్యాయ ధర్మాసనం ఈ కేసును విచారించింది. హేమంత్ సోరెన్ ఉపశమనం పొందడంతో, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియా అలయన్స్ నాయకులు, కార్యకర్తలుసంతోషం వ్యక్తం చేశారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జార్ఖండ్ రాజకీయాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి.
సాయంత్రానికి హేమంత్ సోరెన్ బయటకు వచ్చే అవకాశం ఉంది
జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి రంగన్ ముఖోపాధ్యాయ కోర్టు సోరెన్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు జూన్ 13న,సోరెన్ తరపు న్యాయవాది మరియు ED ASG S.P. రాజు వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. రాంచీలోని బద్గై ప్రాంతంలో 8.86ఎకరాల భూమిని దుర్వినియోగం చేసిన కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ ను ఈడీ జనవరి 31న అరెస్టు చేసింది. ED నిర్బంధించిన తరువాత,సోరెన్ తన పదవికి రాజీనామా చేసారు.అప్పటి నుండి హేమంత్ సోరెన్ రాంచీలోని బిర్సాముండా సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఇదే కేసులో అఫ్సర్ అలీ,జేఎంఎం నేత అంటు తిర్కీ,ప్రియరంజన్ సహాయ్, విపిన్ సింగ్,ఇర్షాద్ సహా మరో 22మందిని కూడా అరెస్టు చేశారు.అందరూ జ్యుడీషియల్ కస్టడీలో జైల్లో ఉన్నారు.