Hemanth Soren: హేమంత్ సొరేన్ మధ్యంతర బెయిల్ కు సుప్రీం నిరాకరణ
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు షాక్ తగిలింది.లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ దాఖలు చేయాలని కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మధ్యంతర బెయిల్ ఎలా మంజూరు చేయగలమని జస్టిస్ దీపాంకర్ దత్తా,జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. హేమంత్ సొరేన్‌కు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై సొరేన్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ పై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.ఆయనపై వచ్చిన ఆరోపణలు అలానే ఉన్నాయి.పైగా కొన్ని వాస్తవాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయవద్దని వ్యాఖ్యానించింది.
రెండు పిటిషన్ ల పరిగణనకి.. నో అన్నధర్మాసనం
లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం కొద్ది రోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ పై వచ్చారు. ఆయన జూన్ 2 వరకు బయట ఉండవచ్చు. సొరేన్ తన బెయిల్ పిటిషన్ తో సహా అరెస్టును తప్పుబడుతూ దాఖలు చేసిన రెండు పిటిషన్ లను పరిగణనలోకి తీసుకోబోమని ధర్మాసనం విస్పష్టంగా చెప్పింది. ట్రయల్ కోర్టులో విచారణలో ఉన్న సంగతిని దాచి తమ వద్దకు వస్తే ఎలా అని నిలదీసింది. దీనిని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు లిస్టింగ్ చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా,జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ నెల 21న ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది.
హేమంత్ సొరేన్ విడుదల వద్దన్న ED
భూకుంభకోణం కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. తన అరెస్టును ఆయన జార్ఖండ్ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అభ్యంతరం రాంచీలోని 8.86 ఎకరాల భూమిని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అడ్డదారిలో పొందారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపణగా ఉన్నది. దీనిపై ఆయనను పలు మార్లు రాంచీ, ఢిల్లీలో ED అధికారులు విచారించారు. వారు అడిగిన ప్రశ్నలకు సొరేన్ సరైన జవాబులివ్వలేదు. పెద్ద ఎత్తున నగదు రూపంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతి ఫలం పొందారని ఎన్ ఫోర్స్ మెంట్ అనుమానిస్తోంది.