LOADING...
Himanta Biswa Sarma: ముందు మీ రెండు చికెన్స్ నెక్‌లు జాగ్రత్త.. బంగ్లాదేశ్‌ను హెచ్చరించిన హిమంత బిశ్వ శర్మ 
బంగ్లాదేశ్‌ను హెచ్చరించిన హిమంత బిశ్వ శర్మ

Himanta Biswa Sarma: ముందు మీ రెండు చికెన్స్ నెక్‌లు జాగ్రత్త.. బంగ్లాదేశ్‌ను హెచ్చరించిన హిమంత బిశ్వ శర్మ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. సిలిగుడి కారిడార్‌ (చికెన్ నెక్) వ్యవహారంలో బంగ్లాదేశ్ తీసుకుంటున్న వైఖరిని లక్ష్యంగా చేసుకుని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సిలిగుడి కారిడార్‌కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాల్‌మోనిర్హాత్ ఎయిర్‌బేస్‌ను బంగ్లాదేశ్ పునరుద్ధరించేందుకు చైనా సాయపడుతోందన్న ఆరోపణలు మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి శర్మ మాట్లాడుతూ.. ''మన దేశానికి చికెన్ నెక్ ప్రాంతం ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్‌కు కూడా రెండు చికెన్ నెక్‌లు ఉన్నాయి. మన మీద దాడి జరిగితే, బదులుగా మేము ఆ రెండు ప్రాంతాలపై చర్యలు తీసుకుంటాం,'' అని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బంగ్లాకు అస్సాం సీఎం స్ట్రాంగ్‌ మెసేజ్‌