Hindu Population: భారత్ లో తగ్గుతున్న హిందూ జనాభా.. EAC- PC అధ్యయనం
భారతదేశంలో హిందూ జనాభా తగ్గిపోతుందట. ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది. ముస్లిం, క్రిస్టియన్, బౌధ్ధ, సిక్కులతో సహ మైనారిటీ వాటా పెరిగింది.EAC -PM ప్రకారం భారత దేశంలో హిందువుల వాటా 1950 లో 84 శాతం ఉంటే 2015 లో 78 శాతానికి తగ్గింది. అదే సమయంలో ముస్లింలు సంఖ్య పెరిగింది. మరోవైపు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ముస్లిం జనాభా పెరిగింది. మే 2024 లో విడుదల చేసిన ఈ అధ్యయనం ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాలను , ట్రెండ్స్ నీ అధ్యయనం చేసింది.
ఇతర దేశాల్లో కూడా మెజారిటీ వాటా క్షీణిస్తున్నట్లు అధ్యయనం
డేటాను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా భారత్ లో మైనార్టీలు కేవలం రక్షించబడటమే కాకుండా అభివృద్ది చెందుతున్నారు అని అధ్యయన రచయితలు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా మెజారిటీ వాటా క్షీణిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. 1950 - 2015 మద్య భారత దేశంలో ముస్లిం జనాభా వాటా 43.15 శాతం పెరిగింది.