తదుపరి వార్తా కథనం
Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 02, 2025
05:17 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.
ఈ అద్భుత విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు.
ఈ సందర్భాన్ని మరువలేనిదిగా గుర్తిస్తూ, తెలుగు తేజాలు విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్, తెలంగాణకు చెందిన గొంగడి త్రిష గొప్ప పాత్రను పోషించారని తెలిపారు.
Details
చారిత్రాత్మక విజయం సాధించినందుకు శుభాకాంక్షలు
ఫైనల్ మ్యాచ్‌లో గొంగడి త్రిష 3 వికెట్లు తీసి, 44 పరుగులతో అజేయంగా నిలిచి, ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
అలాగే షబ్నమ్ షకీల్ బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి తన వంతు పాత్ర పోషించారని హోంమంత్రి పేర్కొన్నారు.
ఈ విజయం మీకు మాత్రమే కాదు, మరెంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని, "జై హింద్!" అంటూ అనిత వారి విజయాన్ని అభినందించారు.