
'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్నకు చెబుదాం' అనే కొత్త పరిష్కార కార్యక్రమాన్ని మే 9 నుంచి ప్రారంభించబోతోంది.
ప్రజల ఫిర్యాదులను వినడం, వాటిని వెంటనే పరిష్కరించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
అయితే ఇందులో ఎలాంటి ఫిర్యాదులు చేయొచ్చు. ఎవరికి ఫిర్యాదు చేయాలనే దానిపై ప్రజల్లో అనుమానాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకు ముందు 'స్పందన' కార్యక్రమాన్ని నిర్వహించేది. స్పందన కంటే మెరుగైన సేవలను ప్రజలకు అందించానే ఉద్దేశంతో ఇప్పుడు అనేక మార్పులతో 'జగనన్నకు చెబుదాం' అనేది కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
'జగనన్నకు చెబుదాం' కి 1902 అనే హెల్ప్ లైన్ ఉంటుంది. ఈ నెంబర్ ద్వారా ఏ సమస్యనైనా ప్రజలు తమ ఇబ్బందులను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలాయనికి చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్
24గంటల్లో ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు
ప్రజలు తమ ఫిర్యాదులను చేయడానికి ఇంటి నుంచే 24గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు. అలాగే దీని కోసం గ్రామ లేదా వార్డు సచివాలాయానికి కూడా వెళ్లవచ్చు.
అలాగే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు వెళ్లవచ్చు. అలాగే జగనన్నకు చెబుదాం పోర్టల్ https://www.jkc.ap.gov.in/ కూడా ఫిర్యాదు చేయవచ్చు.
అలాగే జగనన్నకు చెబుదాం యాప్‌లో కూడా పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. దీని కోసం జగనన్నకు చెబుదాం యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
'జగనన్నకు చెబుదాం'లో వచ్చిన సమస్యలను పరిష్కారానికి జిల్లా కలెక్టర్లు సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో పర్యవేక్షణ యూనిట్లను పర్యవేక్షిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేలా చూస్తుంది.
ఆంధ్రప్రదేశ్
మౌలిక వసతుల ఫిర్యాదులు ప్రజా ప్రతినిధులకే చెప్పాలి
'జగనన్నకు చెబుదాం'లో భాగంగా ఇచ్చిన 1902 హెల్ప్ లైన్ ద్వారా వ్యక్తిగత, గృహస్థాయి ఫిర్యాదులను చేసుకోవచ్చు.
మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన విషాయాలను స్థానికి ప్రజా ప్రతినిధులకు మాత్రమే చెప్పాలి.
'జగనన్నకు చెబుదాం'లో ఫిర్యాదు చేయడం వల్ల పరిష్కారం లభించదు. అలాగే అన్ని రకాల ప్రభుత్వ సేవలు, పథకాల గురించి అడిగి తెలుసుకోవచ్చు.
పౌరుడు ఫిర్యాదు చేసేటప్పుడు తమ పేరు, అధార్ నంబర్‌ను వంటి ప్రాథమిక సమచారాన్ని అందించాల్సి ఉంటుంది.