
Congress: ఎమ్మెల్యే టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు.. కొన్ని చోట్ల ఒకే సీటు కోసం తల్లీకొడుకుల దరఖాస్తులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
దరఖాస్తుకు నేడు చివరి రోజు కావడంతో భారీగా ఆశావహులు హైదరాబాద్‌లోని గాంధీభవన్ కు తరలివెళ్లారు.
నిన్నటి వరకూ 700పైగా దరఖాస్తులు రాగా, నేటితో వచ్చే అప్లికేషన్లలో కలిసి వెయ్యికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొన్ని నియోజకవర్గాల్లో 10 నుంచి 15 దరఖాస్తులు రాగా, మరోవైపు ఒక్కో నేత ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
ఒకే కుటుంబ నుంచి వేర్వేరుగా మరికొంతమంది దరఖాస్తు చేసుకున్నారు.
Details
నాగార్జున సాగర్ టికెట్టు కోసం జానారెడ్డి కొడుకులు దరఖాస్తు
నాగార్జున్ సాగర్ టికెట్ కోసం వచ్చిన దరఖాస్తులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జనారెడ్డి కొడుకులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి నాగర్జున్ సాగర్ టికెట్ కోసం దరఖాస్తు చేశారు.
మరోవైపు మిర్యాలగూడ టికెట్ కోసం రఘువీర్ రెడ్డి ఆప్లికేషన్ దాఖలు చేసుకున్నారు.
ఇక కరీంనగర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ సోదరుడు రంగరావు కుమార్తె రమ్యారావు, అమె కుమారుడు రితేశ్ రావు అప్లికేషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్ లోని ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ అప్ప్లై చేసుకోవడం గమనార్హం.