NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుంభకోణం.. మేనేజర్లు సహా 10 మంది నిందితుల అరెస్ట్ 
    తదుపరి వార్తా కథనం
    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుంభకోణం.. మేనేజర్లు సహా 10 మంది నిందితుల అరెస్ట్ 
    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుంభకోణం.. మేనేజర్లు సహా 10 మంది నిందితుల అరెస్ట్

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుంభకోణం.. మేనేజర్లు సహా 10 మంది నిందితుల అరెస్ట్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 27, 2023
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌ నడిబొడ్డున మరో భారీ బ్యాంక్ కుంభకోణం బయటపడింది. ప్రైవేట్ ఉద్యోగుల పేరిట అకౌంట్లు తెరిచి వాటి ద్వారా రూ.20 కోట్ల మేర పర్సనల్ లోన్లు తీసుకుని బ్యాంక్ ను మోసం చేసిన ఘటన మహానగరంలో చోటు చేసుకుంది.

    బ్యాంక్ సిబ్బంది తోడ్పాటుతోనే ఈ భారీ మోసం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు.ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్లను తెరిచిన 11 మంది ముఠాలో 10 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    మరో నిందితుడు పరారీలో ఉన్నారు. మొత్తం 61 మంది ఉద్యోగుల పేరిట సదరు బ్యాంక్ లో రూ.20 కోట్ల రుణాలు తీసుకున్నారు.

    ఏపీలోని కడపకు చెందిన దీపక్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డిలు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు సైబరాబాద్ సీపీ వెల్లడించారు.

    DETAILS

    రూ. 20 కోట్లను కొల్లగొట్టి  వచ్చిన సొమ్మును అంతా కలిసి పంచుకున్నారు

    దీపక్‌రెడ్డి జీఎస్‌ఆర్‌ అడ్వయిజర్స్‌ పేరిట కంపెనీలకు ఉద్యోగులను అందించేవాడు. తన ద్వారా వివిధ సంస్థలకు వెళ్లిన 67 మంది ఉద్యోగుల పేర్లు, వారి బ్యాంక్ ఖాతాల వివరాలను రాబట్టాడు.

    ఆయా సంస్థల్లో ఉద్యోగులు పనిచేశాక నెలజీతాలతో పాటు పే స్లిప్పులూ అందజేసేవాడు. తర్వాత దీపక్ సంస్థ ఉద్యోగుల హాజరు ఇతర వివరాలను ఇవ్వట్లేదని ఆయా కంపెనీలు ఉద్యోగస్తులను తొలగించారు.

    ఇదే అదునుగా దీపక్‌, రాకేశ్‌రెడ్డి బ్యాంకులకు ఈ సమాచారం చెప్పకుండా 61 మందికి చెందిన వివరాలతో హెచ్‌డీఎఫ్‌ఎసీలో ఆన్‌లైన్ లోన్ల కోసం దరఖాస్తు చేశారు.

    ఈ క్రమంలో బ్యాంక్ సిబ్బందితో కలిసి రూ.20 కోట్లను కొల్లగొట్టి వచ్చిన సొమ్మును పంచుకున్నారు. నెలవారీ వాయిదా బకాయిలు వసూలు కాకపోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    DETAILS

    నిందితుల్లో ఇద్దరు పర్సనల్ లోన్ మేనేజర్లు 

    ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్‌ కడప జిల్లా బుక్కపట్నానికి చెందిన మేకల రాకేశ్‌ కుమార్‌రెడ్డి, అనంతపురానికి చెందిన దేశాయ్‌ దినేశ్‌రెడ్డి, వడ్డే వెంకటేశ్‌, బోయ ఆదినారాయణ, కర్నూలు జిల్లాకు చెందిన సాయి రవివర్మ, కన్సల్టెన్సీ నిర్వాహకుడు పాలూరి దీపక్‌ కుమార్‌ రెడ్డిలను కీలక నిందితులుగా పోలీసులు గుర్తించారు.

    మరోవైపు హైదరాబాద్‌ బాలానగర్‌కు చెందిన ఇ.రాజ్‌కుమార్‌, నిజాంపేటకు చెందిన ఏనుగుల సురేశ్‌, ప్రగతినగర్‌కు చెందిన దగ్గుబాటి సురేశ్‌ లపైనా కేసు నమోదైంది.

    ఇక బ్యాంక్ అధికారులైన బంజారాహిల్స్‌కు చెందిన పర్సనల్ లోన్ మేనేజర్ చిట్టిబాబు, బీహెచ్‌ఈఎల్‌కు చెందిన మరో పర్సనల్ లోన్ మేనేజర్ హరీశ్‌చంద్ర గోపాల శెట్టితో కలిసి నిందితులంతా భారీ మోసానికి తెరలేపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్యాంక్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    బ్యాంక్

    ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు హైకోర్టు
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా
    మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse స్విట్జర్లాండ్
    శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025