Page Loader
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్‌!
డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్‌!

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త మార్గాల్లో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకున్న మోసం ఈ అంశాన్ని మరింత హైలైట్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరు, హావభావాలను ఉపయోగించి సైబర్ మోసగాళ్లు పెద్ద స్కామ్‌కు తెరలేపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ట్రంప్ మాట్లాడుతున్నట్లు ఫేక్ వీడియోలను తయారు చేసి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా పంచారు. ఈ వీడియోల్లో ట్రంప్‌ తన పేరుతో ఓ యాప్ రూపొందించానని, అందులో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చినట్లు చూపించారు. ఈ వీడియోలపై నమ్మకం ఉంచిన తుమకూరు, బెంగళూరు, హవేరి ప్రాంతాలపై ప్రభావం పడింది.

Details

పోలీసులను అశ్రయించిన బాధితులు

దాదాపు 150 మంది పైగా ట్రంప్ పేరుతో ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, అందులో పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాల కాపీలను కూడా నమ్మారు. కొద్ది రోజుల పాటు పెట్టుబడులకు లాభాలుగా కొంత డబ్బు చెల్లించి మోసగాళ్లు నమ్మకం సంపాదించారు. ఆపై ఆ యాప్ నిర్వాహకులు కాల్స్‌కు స్పందించకపోవడంతో బాధితులకు మోసం జరిగిన విషయం అర్థమైంది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ మోసం ద్వారా దాదాపు కోటి రూపాయలకు పైగా నష్టపోయినట్లు సైబర్ క్రైం శాఖ గుర్తించింది. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. పెట్టుబడి పెట్టే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని సూచించారు.