TSRTC New Record: ఉచిత ప్రయాణం.. తెలంగాణ ఆర్టీసీలో ఆల్ టైం రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రావడంతో ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy Govt) అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.
సోమవారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఏకంగా 51.74 లక్షల మంది ప్రయాణాలు చేసినట్లు టీఎస్ఆర్టీసీ (TSRTC) వర్గాలు వెల్లడించారు.
పాస్ హోల్డర్లు మినహా 48.5 లక్షల మందికి ఆర్టీసీ టిక్కెట్లు జారీ చేసింది.
Details
ఒక్క రోజులోనే రూ.21.10 కోట్ల ఆదాయం
వారిలో 30.16 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం.
మహలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు మొత్తం ప్రయాణికులలో కేవలం 40 శాతం మాత్రమే మహిళలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 60 శాతానికి చేరుకుంది.
రీయింబర్స్ మెంట్‌తో కలిపి ఒక్క రోజులోనే రూ.21.10 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఆర్టీసీ జోన్లలో సోమవారం బస్సులు 33.36 లక్షల కిలోమీటర్లు తిరిగాయి.