NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో ఎల్లో అలెర్ట్, వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు.. ఏపీకి వర్ష సూచన
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణలో ఎల్లో అలెర్ట్, వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు.. ఏపీకి వర్ష సూచన
    తెలంగాణలో ఎల్లో అలెర్ట్, వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు.. ఏపీకి వర్ష సూచన

    తెలంగాణలో ఎల్లో అలెర్ట్, వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు.. ఏపీకి వర్ష సూచన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 12, 2023
    10:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాగల 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంల్లో వర్షాలు కురవనున్నాయి. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.

    మరోవైపు ఇప్పటికే తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు రాజధాని నగరం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

    ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హన్మకొండ, జగిత్యాల, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి.

    వచ్చే 5 రోజుల్లో ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి.

    DETAILS

    నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం

    నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం 4.5కిమీ నుండి 7.6కిమీ ఎత్తు మధ్య ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశవైపు నుంచి తెలంగాణవైపుకి వీస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

    హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని నివేదిక ద్వారా వెల్లడించింది.

    మరో వైపు నైరుతి ఆంధ్రప్రదేశ్ లో బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

    DETAILS

    రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరిక

    ఈ మేరకు రాష్ట్రంలో మరో 3 రోజులలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది.

    రానున్న 3 రోజుల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుంది.

    మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

    ఉరుములతో కూడిన వర్షం కురిసే క్రమంలో రైతులు, పొలాల్లో పని చేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఐఎండీ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలంగాణ

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు.. సరిహద్దు జిల్లాల్లో భారీ వర్షాలు వర్షాకాలం
    తెలంగాణ ఉద్యోగులకు సర్కారు వారి భారీ కనుక.. ఇళ్లు కట్టుకుంటే రూ.30 లక్షల అడ్వాన్స్ ప్రభుత్వం
    నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ నైరుతి రుతుపవనాలు
    500 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..దారిపొడవునా ఫ్లెక్సీల హోరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ఐఎండీ

    తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ తెలంగాణ
    తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ తెలంగాణ
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా భారతదేశం

    ఆంధ్రప్రదేశ్

    ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం... ఏకకాలంలో 56,829 మంది టీచర్ల బదిలీ   ప్రభుత్వం
    పాడేరు-లంబసింగి రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్  పాడేరు
    ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు  పాఠశాల
    భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆత్రేయపురం పూతరేకులు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025