
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ ప్రకటించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి కుంభవృష్టి ఉందని అంచనా వేసింది.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.ఉత్తరాఖండ్‌లో శనివారం భారీ వర్షాలు కురవనున్న క్రమంలో ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఈనెల 22 వరకు భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ ను ప్రకటించింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లో ఈనెల 22 వరకు భారీ వర్షాలున్నాయి. రాగల ఐదు రోజుల్లో మహారాష్ట్ర, గుజరాత్‌లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.
details
ముంబై నగరానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ
మహాలో రెడ్ అలెర్ట్ జారీ :
పూణే, రాయ్‌గఢ్, పాల్ఘర్, థానే జిల్లాలకు శుక్రవారం ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు ముంబై మహానగరంలోనూ భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురవనున్నట్లు సూచించింది. ఈ మేరకు రాజధాని నగరానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలోని కొన్ని చోట్ల జులై 26 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముంబైలో శనివారం వరకు అతి భారీ వర్షాలున్నాయని పేర్కొంది.
థానే, పాల్ఘర్‌ల్లోని అంబేగావ్, ఖేడ్, జున్నార్, భోర్, పురందర్, ముల్షి, మావల్ తాలూకాలలోని మొత్తం 355 విద్యాసంస్థలు గురువారం మూతపడ్డాయి. శుక్రవారం సైతం మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
details
ఈనెల 24 వరకు ఒడిశాలో భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరానికి కుంభవృష్టి నేపథ్యంలో గురువారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం 2 రోజుల సెలవు ప్రకటించింది.
మరోవైపు గురువారం ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ పరిధిలో చాలా చోట్ల ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
జాలర్లు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు :
ఒడిశా రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మల్కాన్‌గిరి జిల్లా సహా ఇతర ప్రాంతాల్లోనూ వరదలు ముంచెత్తాయి. ఈనెల 24 వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుందని IMD స్పష్టం చేసింది.