Page Loader
రాగల 3 రోజులలో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ  
రాగల 3 రోజులలో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు

రాగల 3 రోజులలో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 05, 2023
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల 72 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల రాక కోసం అన్నదాతలు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. జులై తొలి వారం పూర్తి కావొస్తున్నా వాతావరణం ఇంకా చల్లబడకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ మేరకు నైరుతి రుతుపవనాలు దోబూచులాడటంతో వానలు కనుమరుగయ్యాయి. అయితే నెమ్మదించిన నైరుతికి బలం చేకూరేలా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో వచ్చే 3 రోజులు వానలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

details

ఇప్పటికే తెలంగాణలోని 19 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలోని 19 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఈ మేరకు 6 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నిజామాబాద్‌, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా రానున్న 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.