Page Loader
Hyderabad : ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను హతమార్చిన భర్త
ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను హతమార్చిన భర్త

Hyderabad : ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను హతమార్చిన భర్త

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2023
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

18 ఏళ్లుగా కలిసి జీవించిన భార్యను భర్త హత్య(Murder) చేసిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మియాపూర్‌లో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోదన్‌కు చెందిన రాజేశ్వరి (38) కి అదే జిల్లా రుద్రురు మండల కేంద్రానికి చెందిన కార్పెంటర్ రాజేష్‌తో 2005లో వివాహమైంది. రాజేష్ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి మియాపూర్‌లో కాపురం ఉంటున్నాడు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తరుచూ వీరిద్దరి మధ్య కొద్దిరోజులుగా గొడవలు మొదలయ్యాయి. ఎలాగైనా రాజేశ్వరిని అడ్డు తొలిగించుకోవాలని డిసెంబర్ 10న గండిమైసమ్మ ప్రాంతంలో ఫంక్షన్ ఉందని భార్యను బైకుపై తీసుకెళ్లాడు.

Details

నిందితుడిని రిమాండ్ కు తరలించిన పోలీసులు

బౌరంపేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ ప్రాంతానికి రాజేశ్వరిని తీసుకెళ్లాడు. తర్వాత రాయితో కొట్టిని రాజేశ్వరిని కిరాతకంగా హత్య చేశాడు. ఇక మృతదేహాన్ని సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడేసి మియాపూర్ కి వచ్చాడు. 12న రాజేశ్వరి తల్లి, సోదరికి ఫోన్ చేసి భార్య కనిపించడం లేదని రాజేష్ డ్రామా మొదలుపెట్టాడు. దీంతో రాజేశ్వరి తల్లి డిసెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజేష్ ను అదుపులోకి తీసుకొని విచారించడంలో అసలు విషయం బయటపడింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.