Page Loader
Hyderabad : హైదరాబాద్‌ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు
హైదరాబాద్‌ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు

Hyderabad : హైదరాబాద్‌ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారు డ్రగ్స్ విక్రయించి సంపాదించిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో బయటపడింది. ఫారెక్స్ సేవలు, మనీ ట్రాన్స్ఫర్‌ల సాయంతో ఈ డబ్బు దేశం వెలుపలికి చేరుతోంది. ఈ ముగ్గురు నైజీరియన్లు హైదరాబాద్‌లోనే నివసిస్తూ, అక్కడి నుంచే డ్రగ్స్ రాకపోకల్ని సమన్వయం చేస్తూ ఉన్నట్టు నార్కోటిక్ బ్యూరో వెల్లడించింది. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నారు.

Details

కొరియర్ ద్వారా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నిందితులు

ఇదే నేపథ్యంలో, గత సంవత్సరం ఫిబ్రవరిలో నైజీరియాకు చెందిన మరో మాదకద్రవ్యాల విక్రేతను టీన్యాబ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రానికి చెందిన ఇవూలా ఉడోక స్టాన్లీ, ఉత్తర గోవాలోని కండోలింలో నివసిస్తూ మత్తు దందాలో లీనమై ఉన్నాడు. డ్రగ్స్‌ను కొరియర్‌ ద్వారా గోవా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తూ, అవసరమైన వ్యక్తులకు వాటిని విక్రయిస్తున్నాడు. ఎస్‌ఆర్‌నగర్‌ మెట్రో స్టేషన్ వద్ద అతడిని పట్టుకున్న టీన్యాబ్ పోలీసులు, అతని ద్వారా భారీ మాదకద్రవ్యాల మాఫియాను బట్టబయలు చేశారు. ఇలా నైజీరియా దేశానికి చెందిన పలువురు మాదకద్రవ్యాల మాఫియాలో నిమగ్నమై ఉండటం గమనార్హం. తాజాగా అరెస్టైన ముగ్గురు నైజీరియన్ పౌరులతో మరోసారి డ్రగ్స్ మాఫియా నెట్వర్క్‌ను బయటపెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.