
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు; ఏప్రిల్ 1 నుంచి అమలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్) ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో కొత్తగా ప్రవేశపెట్టిన ఆఫర్లు, డిస్కౌంట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని యాజమాన్యం ప్రకటించింది.
హైదరాబాద్
రూ.99తో మెట్రోలో అపరిమిత ప్రయాణం
హైదరాబాద్ మెట్రో తీసుకొచ్చిన సూపర్ సేవర్ ఆఫర్-59 విశేష ఆదరణ పొందింది. ఈ ఆఫర్ కింద దాదాపు 1.3 మిలియన్ల మంది ప్రయాణించారు. ఈ నెల 31తో ఈ ఆఫర్ ముగుస్తుంది. దీనికి కొనసాగింపుగా మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది హైదరాబాద్ మెట్రో యాజమాన్యం. 'సూపర్ సేవర్ ఆఫర్-99' పేరుతో తీసుకొచ్చిన కొత్త ఆఫర్‌ను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయనుంది. ఇది మార్చి 31, 2024 వరకు ఉంటుంది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులు రూ.99తో 100 సెలవు దినాల్లో అపరిమితంగా మెట్రోలో ప్రయాణించవచ్చు. ఎస్ఎస్ఓ-99 కింద ఆఫర్ వర్తించే నోటిఫైడ్ సెలవుల జాబితా ఆన్‌లైన్, స్టేషన్‌లలో అందుబాటులో అందుబాటులో ఉంచుతామని యాజమాన్యం ప్రకటించింది.