తదుపరి వార్తా కథనం

IMD: వాతావరణశాఖ చల్లని కబురు.. మండుతున్న ఎండలు, ఉక్కపోత వాతావరణం నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 31, 2025
12:29 pm
ఈ వార్తాకథనం ఏంటి
మండుతున్న ఎండలు,ఉక్కపోత వాతావరణం నడుమ వాతావరణ శాఖ (IMD)ఓ శుభవార్తను ప్రకటించింది.
భూ ఉపరితలం వేడెక్కడం వల్ల తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, అయితే 4వ తేదీన వర్ష ప్రభావం తగ్గవచ్చని పేర్కొంది.
వర్షాల ప్రభావంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 3-4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అదిలాబాద్,కుమ్రం భీం ఆసిఫాబాద్,నిర్మల్, నిజామాబాద్,కామారెడ్డి,మెదక్,మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని కూడా హెచ్చరించింది.